Sunday 3 May 2020

రామాయణము , యుద్ధకాండ ---------నూటపదిహెనవసర్గ

                                          రామాయణము 

                                       యుద్ధకాండ ---------నూటపదిహేనవసర్గ 

రామరావణ  యుద్ధము  చూడడానికి వచ్చిన  దేవతలు,   రాక్షసులు , గంధర్వులు ,  రావణుడి వధ చూసిన  తర్వాత  ఆ యుద్ధ గాధలను  ముచ్చటించుకుంటూ  తమ తమ విమానాలలో  తమ స్థలములకు బయలుదేరిరి .  వారు  శ్రీ రాముడి పరాక్రమమును,  సుగ్రీవుడి వ్యూహ  రచనను,  వానర వీరుల  వీరోచితమైన  యుద్ధ  కౌశల్యమును , లక్ష్మణుడి భాతృ ప్రేమను , సీతా దేవియొక్క పాతివ్రత్యమును , హనుమంతుడి యుద్ధసామర్థ్యమును ,  పొగుడుకుంటూ  తమతమ ఇళ్లకు పయనమయ్యిరి.  మాతలి  శ్రీ రాముడి అనుమతితో  రధముని తీసుకొని  ఇంద్రలోకమునకు  వెళ్లెను . శ్రీ రాముడు  ఎంతో సంతోషంతో  సుగ్రీవుడిని  కౌగలించుకొనెను . శ్రీ రాముడి ఆజ్ఞతో  లక్ష్మణుడు  బంగారు కలశములను వానర ప్రముఖులకు ఇచ్చి  సముద్రజలము తెప్పించెను . ఆ సముద్రజలంతో  విభీషణుడిని  లంక నగరమునకు  రాజుగా పట్టాభిషేకము చేసెను .  పిమ్మట  అక్కడి వానర యోధులందరు  లంక నగర ప్రభువు   విభీషణునికి జై అని   జయజయద్వానములు  చేసిరి . అపుడు శ్రీ రాముడు  హనుమంతునితో   " హనుమా  లంకా నగర ప్రభువు ఐన  విభీషణుడి  అనుమతి తీసుకొని లంకా నగరంలోని  అశోకవనంలోకి ప్రవేశించి  అక్కడ ఉన్న సీతకు  మన విజయ వార్తను  తెలియ బరుచుము .  రావణుని నేను సంహరించిన విషయము  చెప్పు . నేను లక్ష్మణుడు  విభీషణుడు   , సుగ్రీవుడు , అందరం  క్షేమంగా ఉన్నామని తెలిపి  సీతా దేవి సందేశాన్ని తీసుకొని రా " అని పలికెను . 
రామాయణము --------యుద్ధకాండ --------నూటపదిహేనవ సర్గ ---------సమాప్తము 


శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 














No comments:

Post a Comment