Thursday 7 May 2020

రామాయణము యుద్ధకాండ -నూట ఇరువదియెనిమిదవసర్గ

                                 రామాయణము 

                                  యుద్ధకాండ -నూట ఇరువదియెనిమిదవసర్గ 

అప్పుడు శ్రీరాముడు క్షణకాలం అలోచించి ,మారుతి పిలిచి అతనితో "మారుతీ!తల్లులు మొదలగు వారి క్షేమ సమాచారమును తెలుసుకుని రమ్ము !మొట్టమొదట నీవు శృంగిబేరి పురమునకు వెళ్లి అక్కడి నిషాద రాజు ఐన గుహునికి నా క్షేమ సమాచారం తేలిపి ,నేను అతని యోగ క్షేమములను అడిగినట్లు తెలుపుము . పిమ్మట నీవు భరతుని వద్దకు వెళ్లి నేను అతని క్షేమ సమాచారములు అడిగినట్లు తెలుపుము . పిదప నేను వనవాస దీక్షను పూర్తిగా ముగుంచుకుని వచ్చుచున్నట్టు తెలుపుము . రావణుడు సీతాదేవిని అపహరించుట ,సుగ్రీవుని సాయముతో సీతాదేవిని అన్వేషించుట ,పిదప వారధి నిర్మించుట ,రావణవధ మొదలగు విషయములన్నియు వివరముగా వివరింపుము . మారుతి ఈ మాటలు వింటున్నప్పుడు భరతుడి ముఖకవళికలు గమనింపుము . అంతేకాక నా పట్ల అతడి వైఖరిని కూడా పరిశీలించుము . వంశపారంపరగా వచ్చే అపారమైన రాజ్యము చేజిక్కినపుడు మనసు మారుటకు అవకాశము వున్నది . ఒకవేళ నా సోదరుడి మనసు అలా మారినట్టయితే ,అతడికి రాజ్యమును ఇచ్చివేయుటకు నేను సిద్దము . ఈ పంచమి రాత్రి గడిచిన పిమ్మట నేను నా మిత్రులు ,శ్రేయోభిలాషులతో సహా  అయోధ్య చేరెదనని భరతుడికి తెలుపుము . "అని పలికెను . 
వెంటనే హనుమ బయలుదేరి వెళ్తూ అయోధ్యా నగరమునకు దగ్గరలో ఉన్న  భరతుడిని చూసేను . అప్పుడు అతడు నారచీరలు , జింకచర్మములు , ధరించి  మిక్కిలి  బక్కచిక్కి ఉండెను అతడుకూడా శ్రీ రాముడి వాల్ర కందమూలఫలములనే  ఆహారముగా  కొనుచుండెను .  బలపరాక్రమములు కల  యోధులతోనే  కాషాయవస్త్రాలు ధరించిన జనులతోను కలిసిఉన్న  భరతుడిని  హనుమ చూసేను . అప్పుడు హనుమ  భరతుడి వద్దకు వెళ్లి  అతడితో " మహాత్మా  ! నీకు సంతోషకరమైన వార్త చెబుతాను . విను శ్రీ రామచంద్ర ప్రభువు వనవాస దీక్షముగించుకొని  ఇక్కడికి  రాయబోవుచున్నాడు రావణాదులను  హతమార్చి సీతాదేవిని గైకొని  కృతకృతేదై , మిక్కిలి సంతోషముతో  మహా బలశాలురైనా మిత్రులతో కలిసి నీవద్దకు వచ్చుచున్నాడు . "  అని పలికెను . 
మారుతిమాటలు విన్నంతనే  సంతోషముతో  భరతుడు పొంగిపోయి  నేలెపైపడి  తననుతానుమరచి పోయెను . ఒక క్షణకాలం తర్వాత  లేచి  తనకు ప్రియవాతాను తెలిపిన హనుమని  తనివితీరా అక్కున చేర్చుకొనెను , పిదప  అనాదాశ్రువులతో భరతుడు  హనుమతో "  మహాత్మా నీదివ్య తేజస్సును చూస్తే  మానవ మాత్రుడిగా తోచుటలేదు . నాపై గల అనుగ్రహముతో  నీవు ఇచటకు వచ్చిన దేవుడవై ఇంతటి చల్లని వార్తను తెలిపిన నీకు  లక్షగోవులను వందలకొలది గ్రామాలను  సమర్పించెదను  అంతేకాదు  సదాచార సంపన్నులైన  పదుహారుమంది కన్యకను  భార్యలుగా అర్పించెదను ' అని పలికెను . 

రామాయణము  యుద్ధకాండ నూట ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



















No comments:

Post a Comment