Sunday 10 May 2020

రామాయణము ఉత్తరకాండ ----------మొదటిసర్గ

                                      రామాయణము 

                                        ఉత్తరకాండ ----------మొదటిసర్గ 

శ్రీ రాముడు పట్టాభిషిక్తుడైన పిమ్మట అగస్త్యుడు  కణ్వుడు , కౌశికుడు , విస్వామిత్రుడు , అత్రి , మొదలగు మహాసృషులందరు రామలక్ష్మణులను అభినందించుటకై అయోధ్యకు విచేసిరి . వారు అయోధ్యకు  వచ్చిన విషయము తెలుసుకున్న శ్రీ రాముడు వారిని సాదరంగా ఎదురెళ్లి  ఆహ్వానించి  తన భావనమునకు తీసుకొనివచ్చెను . అచటకాల  శ్రేష్ఠములైన ఆసనములపై వారిని కూర్చుండబెట్టి . గోదానాది  దానములను చేసెను . శ్రీ రాముడి ఆదరాభిమానములకు  సంతుష్టులైన మహర్షులు  శ్రీ రామునితో " రఘునన్దనా ! , రావణుని హతమార్చి  అందరికి ఆనందము కూర్చితివి రాక్షసరాజైన రావణుని  సపరివారాజంగా  హతమార్చుట  నీకు ఒక లెక్కలో గల విషయము కాదు . వాస్తవానికి  నీవు  ముల్లోకములనుం జయింప గల వీరుడవు రామా!  ప్రహస్తుడు  వికటుడు  , విరూపాక్షుడు , మహోదరుడూ, అకంపనుడూ,దుర్ధర్షుసు , కుంభకర్ణుడు , త్రిశిరుడు , అతికాయుడు , కుంభుడు , నికుంభుడు , ధూమ్రాక్షుడు మొదలగు రాక్షులందాయిని  యుద్ధమున  హతులైరి . రాక్షస వీరులందరు గోరంగా పోరుజరిపి  నీ బాణములకై  హతులైరి ఇది మాకు ఎంతో సంతోష దాయకం .  ఇంద్రజిత్తు వలన సమ్భసవించిన  నాగబంధములన్న్నియూ నీవు లక్ష్మణుడు  విముక్తులై  మిక్కిలి మాయావి ఐన ఇంద్రజిత్తును వధించిన  వార్త వినగానే  మాకు  కలిగిన ఆనంద  ఆశ్చర్యములను , అవధులు లేనివి .  ఇందులకు  మేంమందారము నిన్ను   అభినందించుచున్నాము .  నీవు  మాఅందరిని  శాంతి  సౌభారాగ్యములను ప్రసాదించితివి .  నీవు కలకాలం  వర్దిల్లెదవుకాక " అని పలికెను . 
మహాత్ములైన  ఆ ఋషీశ్వరుల యొక్క  అభినందన వచనములు విన్న  శ్రీ రాముడు మిక్కిలి ఆష్క్యార్యపడి వారితో "  పూజ్యులైన మహాత్ములారా నిశాచరులైన  రావణ కుంభకర్ణులు ఇరువురు  మహా వీరులే  వారివద్ద వున్న  రాక్షసులందరు  కూడా మహావీరులే కదా వారందని   కాదని మీరు  ఇంద్రజిత్తును మాత్రమే  పొగుడుటకు కారణమేమి ? . అతని  శక్తిసామర్ధ్యాలు ఎలాంటివి? . బలపరాక్రమాలు ఇటువంటివి? .  అతడు ఇంద్రుయిని ఏవిధముగా జయించాడు ? అతడు ఏ  ఏ  వారములు పొందినాడు ? ఈ విషయములన్నీ  రహస్యములు కానిచో  నేను వినదగినవి అయినచో  వాటిని నేను వినేకొరుచున్నాను .  దయ తో తెలుపుము . ఇది నా ప్రార్ధన . " అని పలికెను . 

రామాయణము ----------ఉత్తరకాండ ---------మొదటిసర్గ -----------సమాప్తము . 

శశి, 

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు) తెలుగు పండితులు . 












No comments:

Post a Comment