Thursday 14 May 2020

రామాయణము ఉత్తరకాండ --------పదిహేనవసర్గ

                                       రామాయణము 

                                        ఉత్తరకాండ --------పదిహేనవసర్గ 

కుబేరుడు  తన సేనాపతి ఐన  మని  బ్రదుడు  ని  రావణునితో  యుద్ధమునకు  పంపెను . మణిభద్రుడు  నాలుగు వేళా మంది  యక్షసైనికులతో  యుద్ధమునకు  దిగెను . రాక్షసులు  మాయోపాయములను  పన్నుచూ  యుద్ధము చేయుచుండిరి .  యక్షులు మాత్రము  ధర్మ యుద్ధమును  కొనసాగించుచుండిరి .  అందువలన  యుద్దములో  రాక్షసులదే పై చేయిగా  ఉండెను .  రావణుడు  మణిభద్రుడపై  విరుచుకుపడెను .  రావణుడి ప్రతాపము  తట్టుకొనలేక    మణిభద్రుడు  యుద్ధరంగము  నుండి వెళ్లి పోయెను . 
అది చూసిన  కుబేరుడు  సమరభూమికి వచ్చి  రావణుడితో  " దుర్మతీ ! , రావణా! నను  నిను ఎంతగా వారించుచున్నాను  నా మాటలు పెడచెవిన  పెట్టుచున్నావు . నీ దుష్కర్మల  ఫలముగా  నరకము పొందిన పిమ్మట గాని  నా  మాటల విలువ నీకు తెలిసిరాదు .  దుష్టుడు , అజ్ఞ్యానము వలన  విషము త్రాగినప్పుడు  అది  ప్రమాదకరమైనదని  ఎరుగడు . కానీ  దాని  దుష్ప్రభావము   అనుబవములోకి  వచ్చునప్పుడు  మాత్రమే  అతడు  తెలుసుకొనగలడు . తల్లి తండ్రులను , గురువులను , అవమానపరిచినవాడు మరణించిన పిమ్మట  నరక  యాతనలు  అనుభవించుట  తధ్యము .  దేహము  ఉండగానే తపస్సు  ఆచరింపని వాడు  మూర్ఖుడు . ఇక నీతో  మాటలు  అనవసరం యుద్ధమునకు రా " అని పలికెను . 
కుబేరుడు , రావణుడు తీవ్రముగా  యుద్ధమును చేసుకొని సాగిరి . కుబేరుడు  ఆగ్నేయాస్త్రము  ప్రయోగించెను . రావణుడు  నిర్వీర్యము  చేసెను . ఇరువురు  అనేక అస్త్రశస్త్రములతో  తమ  శక్తీ మేరా యుద్ధము చేసిరి . అయినను  ఏ ఒక్కరు ఓడలేదు . లంకాధిపతి  కుబేరున్ని  నశింపచేయుటకై రాక్షస  మాయను ఆశ్రయించెను . ఆ మాయ ద్వారా ఒక సారి పెద్దపులిలా  , మరో సారి వరాహములా , మేఘములా, పర్వతములా ,  సముద్రములా , వృక్షంలా  , ఇలా  అనే రూపములలో  కనపడెను .  కానీ  తన  సహజ  రూపములో మాత్రము కనపడలేదు . పిమ్మట  రావణుడు  పెద్ద గాధను  తీసుకొని . కుభేరుణ్ణి  తీవ్రముగా  కొట్టెను . ఆ దెబ్బకు కుబేరుడు  మూర్చిల్లి  రథముపై  పడిపోయెను . అప్పుడు పద్మము , సంకహము , మున్నగు  నిధుల అధిష్టాన దేవతలు కుబేరుని చుట్టూ చేరి , ఆయనను నందన  వనముకు తీసుకువచ్చి  సేద తీర్చిరి రాక్షస రాజు ఆ ధన పతిని  జయించి  ఎంతగానో సంతోషించెను . పిమ్మట అతడు  విజయ సూచకుమగా  కుబేరుని పుష్పక విమానమును  తీసుకొనెను . యజమాని కోరిక మేరకు సంచరించే  ఆ పుష్పక విమానము రావణుడు  తన  మంత్రులతో  సహా  అధిరోహించెను . 

రామాయణము -------ఉత్తరకాండ ------------పదిహేనవసర్గ ----------సమాప్తము 

శశి ,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగుపండితులు . 














No comments:

Post a Comment