Tuesday 5 May 2020

రామాయణము యుద్ధకాండ -------------------నూటఇరువదియవసర్గ

                                     రామాయణము 

                               యుద్ధకాండ -------------------నూటఇరువదియవసర్గ 

వానర రాక్షసుల  హాహా కార ధ్వనులు విని  శ్రీ రాముడు ఎంతో దుఃఖితుడై  కన్నీరు కారుస్తూ క్షణ కాలము పాటు  ఆలోచన లో మునిగెను . అప్పుడు  యక్షరాజైన కుభేరుడు  , యముడు , ఇంద్రుడు, వరుణుడు  , శివుడు , బ్రహ్మ,తమ తమ  విమానంలా పై అక్కడకు వచ్చి  శ్రీయ రాముడి సమీపమున నిలబడిరి .  వాగారిని చూసి శ్రీ రాముడు  చేతులు జోడించి నమస్కరించెను . అపుడు బ్రహ్మ దేవుడు"  రామ! నీవు  సర్వశ్రేష్ఠుడవు  , జ్ఞ్యానులలో అగ్రీశ్వరుడవు ,సీతా దేవి  అగ్ని ప్రవేశము చేస్తుంటే ఎందుకు మాట్లాడ  కుండా ఊరుకొన్నావు .  నీయవు సర్వజ్ఞుడవు  , సర్వ శక్తివంతుడవు , సర్వేశ్వరుడవు  , స్వయంభువుడవు , శ్రేష్ఠుడైన శ్రీ మన్నారాయణుడవు  అటు వంటి నీవు  విదేహ రాజకుమారిని ఎందుకు ఉపేక్షించితివి . " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు  వారితో  "  మహాత్ములారా !  నేను  దశరత్సమహారాజు కొడుకుగా  సామాన్య మానవుడిగానే  అనుకొంటున్నాను  .  నేను ఎవ్వరినో ఎక్కడి వాడనో  దయచేసినాకు తెల్పుడు " అని పలికెను . 
అప్పుడు బ్రహ్మ దేవుడు  " సత్య పరాక్రమ ! రామా ! ఎడారడము తెలిపెదను వినుము  నీవు జగ్దకారుడవైన  నారాయణుడవు  , లక్ష్ముడేవి  నీవక్షస్థలమున నివసించుచుండెను .  సుదర్శన చక్రము నీఆయుధము .  శార్జము  నీ ధనుస్సు  నందకము అనునది నీఖడ్గము  , నీవు సర్వ వ్యాహుడవు , సర్వ కాలముల యందు లోక కంఠకులను  తును మాడు వాడవు  నాశనము  లని వాడవు ఆది మధ్యతర రహితము . జగన్నాధుడవు  , ధర్మార్థ కామ  మోక్షాలనే  చతుర్విధ పురుషార్ధములను అనుసరించువాడవు . నీవులేనిదే  ఏదియో లేదు  నీవు శ్రీ మహా విష్ణువి  సేత్తా సాద్వియే లక్ష్మీదేవి  రాబోవు ద్వాపర యుగములో  దుష్టశిక్షణ శిష్టరక్షణకై  అవతరించు  శ్రీ కృష్ణుడవి కొద నీవే  శ్రీ కృష్ణుడవు లోక కంటకుడైన  రావణుదీని వధించుటకే  ఈ భూలోకమున  మానవ రూపమున  అవతరించినావు .  

రామాయణము -------------- యుద్ధకాండ -------------నూటఇరువదవసర్గ -----------సమాప్తము 

శశి, ఎం.ఏ ,ఎం.ఏ,(తెలుగు), తెలుగుపండితులు . 







No comments:

Post a Comment