Thursday 7 May 2020

రామాయణము యుద్ధకాండ -నూటఇరువదితొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                                   యుద్ధకాండ -నూటఇరువదితొమ్మిదవసర్గ 

భరతుడు ఇంకా హనుమ తో "మహాత్మా !నా ప్రభువైన శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్లిన పిమ్మట ఇంతకాలమునకు ఆ స్వామీ సమాచారం వినగలిగితిని . నాకు చాలా సంతోషముగా ఉన్నది . అసలు శ్రీరామునకు వానరులకు సమాగమము ఎలాజరిగినది ?దానికి కారణమేమిటి ?నాకు తెలుపుము "అని అడిగెను . 
అప్పుడు హనుమ శ్రీరాముడు దండకారణ్యమున ప్రవేశించిన దగ్గర నుండి ,జరిగిన విషయములన్ని సవివరముగా తెలిపెను . పిమ్మట మారుతి "యుద్ధానంతరం దేవతలు శ్రీరాముని కి వరములు ఇచ్చిరి . శ్రీరాముడు సీతాలక్ష్మణులతో ,వానరులతో ,విభీషణుడితో కలిసి పుష్పక విమానంపై భరద్వాజాశ్రమను చేరినాడు . రేపు ఉదయమునకు ఆ స్వామిని నీవు దర్శింపగలవు . "అని పలికెను . అప్పుడు భరతుడు ,హనుమకు నమస్కరించి ,'నా చిరకాలవాంఛ నేటికీ నెరవేరుతున్నది కదా 'అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ నూటఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment