Wednesday 13 May 2020

రామాయణము ఉత్తరకాండ --------------- పదమూడవసర్గ

                                        రామాయణము 

                                   ఉత్తరకాండ  --------------- పదమూడవసర్గ 

అగస్త్యుడు శ్రీ రాముడితో  ఇంకా ఇలా చెపుతున్నాడు "రామా! కొంతకాలము  పిమ్మట బ్రహ్మదేవుడు  నిద్రాదేవతను  లంకకు  పంపెను . ఆ దేవి  ఖుమభకర్ణుణ్ణి  ఆవహించెను . అప్పుడు కుంభకర్ణుడు నిద్రబాధను తట్టుకొనలేక తనకొక భావనమును ఏర్పాటుచేయమని  రావణుని  అడిగెను . రావణుడు ఒక భావనమును ఏర్పాటు చేయగా కుంభకర్ణుడు  అందులోనే అనేక  వేళా సంవత్సరములు  ఈమాత్రము మెలుకువలేక  నిద్రలో మునిగెను . 
రావణుడు  నిరంకుశుడై దేవతలను, ఋషులను  , యక్షులను , గంధర్వులను, పీడింపసాగెను అతడు  ఇంద్రుడి నందన వనమును మొదలగు  చిత్రవిచిత్రములైన ఉద్యానవనములు అన్నింటినీ  ధ్వంసము చేసెను . అతడు  నీటిలో ఉండే జంతువులను  బాధించెను . మహా వృక్షములను పెకలించివేయుచుండెను . పర్వతములను బ్రద్ధలుకావించుచుండెను . ధనాధిపతి ఐన  కుభేరునికి  రావణుని ఆగడములు తెలిసెను . అప్పుడతడు తనవంస  కీర్తి ప్రతిష్టలను  గుర్తుకు తెచ్చుకొని సోదరప్రేమతో  చొరవతీసుకుని  దశగ్రీవుని  హితము కోరి  ఒక దూతను  లంకా నగరమునకు పంపెను . 
వెంటనే  ఆ దూత లంకానగరమునకు వెళ్లి మొదట విభీషణుడిని  కలిసెను . విభీషణుడు దూతకు అతిధి   సత్కారములు  చేసి  అతని రాకకు కారణమడిగెను . పిదప  కుభేరునియొక్క  , అతని  బంధువులయొక్క  క్షేమ సమాచారములు అడిగి  తెలుసుకొనెను .  పిమ్మట విభీషణుడు  సభలో  ఆసీనుడై ఉన్న  రావణుడి వద్దకు అతడిని తీసుకువెళ్ళేను . ఆ దూత రావణుడిని  దర్శించి, అతడికి  నమస్కారముచేసి , అతడితో  " మహారాజా ! మీ సోదరుడు  కుబేరుడు  పంపిన సందేశమును  యధాతదంగా  వినిపించెదను  దయతో ఆలకింపుడు  ' సోదరా ! నీవు  ఇంత వరుకు చేసిన ఘనకార్యములు ఇక చాలును  నీకు సాధ్యమైనచో  నీ బుద్ధిని  ఉత్తమ ధర్మమార్గమునకు , మరల్చుము . అది నీకు ఎంతో శ్రేయస్కరము నీవు ధ్వంసము చేసిన నందనవనమును  చూసితిని . నీవు ఋషులను భాధించినట్లు వింటిని . దేవతలు  ప్రతీకారము తీర్చుకొనుటకై  పూనుకున్నట్లు తెలిసినది . తమ్ముడా  నీవు నేను చెప్పిన మాటల్ని అనేక సార్లు పెడచెవిన పెట్టినావు . నేను జితేంద్రుడనై నియమ నిష్టలతో  కేదారవ్రహమును  ఆచరించుటకై  హిమవత్ పర్వతము  చేరితిని అక్కడ నేను  పార్వతీ సమేతుడైన  పరమేశ్వరుడిని దర్శించితిని . అప్రయతంముగా నా ఎడమ కంటి దృష్టి  ఆ దేవిపై పడినది  ఎవరీమె  అని మాత్రమే చూచితిని కానీ అప్పుడు నాలో ఈ దురుద్దేశము  లేదు ఆ దేవియొక్క  దివ్యతేజ ప్రభావముచే నా ఎడమకన్ను దగ్ద మై పోయి  పింగళి వర్ణమును పొందినది .  పిమ్మట నేను  ఎనిమిదివందల  సంవత్సరకాలం  మౌనముగా  ఆ మహావ్రతము చేసాను . అప్పుడు  పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షమై ' కుబేర ! నీవు తపస్సుచే  నన్ను మెప్పించితివి కావున  ఇప్పడి  నుండి  నీవు నాకు స్నేహితుడవి అని పలికెను .  ఈ విధముగా సంఖరునికి  మిత్రుడనై  ఆ ప్రభువు అనుజ్ఞతో  అలకాపూరికి చేరితిని . పిమ్మట  నీ పాపా కృత్యములు గురించి విన్నాను .  వాటివలన  మన  వంశమునకు  తీరని  కళంకము  ఏర్పడును . కావున  ఆ పాపా కార్యములను  మానుకో ఇప్పుడు దేవతలు  మహర్షులు నిన్ను వధించు ఉపాయములు గూర్చి  ఆలోచనలు  చేయుచున్నారు . " అని దూత కుబేరుని పలుకులను  వినిపించెను . 
దూత పలికిన కుబేలుని వచనములు విని  రావణుడు క్రుద్ధుడై  కన్నులెర్రజేసి పండ్లుపటపటా  కొరుకుతూ , చేతులను బిగించుచూ " దూతా ! నీవు పలికిన  అతని ప్రలాపముల  అంతరార్ధము గ్రహించితిని . దుర్భాషలు వినిపించినందుకు  నీవు  ఇప్పుడే మృత్యుముఖమునకు చేరెదవు . అంతేకాదు  నిన్ను  పంపిన నా సోదరుడు కూడా మిగలదు . అతనికి మహేశ్వరునితో  మైత్రి ఏర్పడినట్లు బహుశా నన్ను భయపెట్టుటకై  నీవు చెప్పుచున్నావేమో?' ఈ రావణునకు నేను అన్నను  కనుక  ఇతడు నన్ను చంపడు' అని భావించుచున్నాడేమో .?నా భాహు బలముచే ముల్లోకములను కూడా  జయింప గలను . అపరాధము చేసినవాడు కుబేరుడి ఒక్కడే అయినను  అతని మూలంగా  నలుగురు  దిక్పాలకులను  మృత్యువు పాలు చేసెదను . ఇలా పలికిన పిమ్మట  ఆ రావణుడు  దూతను  తన ఖడ్గమునకు  భలి ఇచ్చెను . అతని కళేబరమును  రాక్షసులకు  ఆహారముగా      ఇచ్చివేసి ను . అనంతరము  అతని అనుచరులు  జయజయములు పలుకుచుండగా  రావణుడు  రధమును  అధిరోహించి  కుబేరుడివద్దకు  బయలుదేరెను .  

రామాయణము -------ఉత్తరకాండ -------పదమూడవసర్గ ----------సమాప్తము . 

శశి , ఎం.ఏ ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 








No comments:

Post a Comment