Saturday 2 May 2020

రామాయణము యుద్ధకాండ -----------నూటతొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                         యుద్ధకాండ -----------నూటతొమ్మిదవసర్గ 

 రాముడు , రావణుడు , ఇరువురు తమతమ  రథముల పై నుండి  చేయుచున్న గోరయుద్ధము సర్వలోకములను భీతిల్లచేయుచుండెను .  ఉభయపక్షముల సైనికులు  వివిధ ఆయుధములను ధరించి యుద్ధమునకు సిద్ధముగా ఉండిరి .  అయినను  వారు  ఆ మహావీరులమధ్య  జరుగుతున్న యుద్ధమును  ఆశ్చర్య చికితులై  చూస్తూ  ప్రతిపక్ష యోధులతో  యుద్ధం చేయక  నిలబడివుండిరి  . రాక్షస సైనికులు  రావణుడిని , వానరయోధులు శ్రీ రాముడిని  ఆశ్చర్యముతో  కళ్లప్పగించి చూస్తూఉండిరి . దశగ్రీవుడు మిక్కిలి  కోపంతో  రాముడి  రథముపై ఉన్న ధ్వజమును  లక్ష్యముగా చేసుకొని  బాణములు ప్రయోగించెను . కానీ  ఆ బాణములు  ఇంద్ర రధము యొక్క  ప్రభావముచే  ధ్వజమును తాకకుండానే నేలపై పడిపోయింది . 
పిమ్మట రాముడు తన బాణముతో  రావణుడి ధ్వజమును విరగగొట్టెను . రావణుడు రోషంతో  రాముడి రధాశ్వములపై బాణములను ప్రయోగించెను . కానీ  ఆ బాణములు  ఇంద్రుడి రధాశ్వములను  ఏమాత్రము భాదించలేకపోయినవి  మిక్కిలి కోపంతో రావణుడు  అనేక శస్త్రములను  ప్రయోగించెను . శ్రీ రాముడు తన బాణములతో  ఆ శస్త్రములన్నిటినీ   నిర్వీర్యము చేసెను . వారిరువురు ప్రయోగించుచున్న , బాణములు పరస్పరము ఢీకొని భూమిపై పడిపోవుచున్నవి . ఇలా జరిగిన సంకుల సమరం చూచువారికి  రోమములు  నిక్కబొడుచుకొనెను . శ్రీ రాముడు తన రధ ధ్వజమును విరగగొట్టుటచే  రావణుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఉండెను . 


రామాయణము -------యుద్ధకాండ----------నూటతొమ్మిదవసర్గ -------సమాప్తము ---------------



శశి,

ఎం.ఏ , ఎం.ఏ,(తెలుగు), తెలుగు పండితులు . 














No comments:

Post a Comment