Monday 11 May 2020

రామాయణము ఉత్తరకాండ ----------అయిదవసర్గ

                                          రామాయణము 

                                          ఉత్తరకాండ ----------అయిదవసర్గ 


గంధర్వుడైన  గ్రామాని  సుఖేసుడుని చూసి  తన కుమార్తె ఐన  దేవవతిని ఇచ్చి వివాహము చేసెను . వారికి  మాల్యవంతుడు , మాలి , సుమాలి అను ముగ్గురు సంతానము  . వారు  మిక్కిలి బలశాలులు  ఆ ముగ్గురు సోదరులు  తన తండ్రి ఐన సుఖేసుడు  పరేమేస్వరుడి వలన వరములు పొందినట్లు తెలుసుకొని  మేరు పర్వతమునకు చేరి  ఘోర మైన తపస్సుని ఆచరించ సాగిరి .  ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై  వరములను కోరమనెను .  అప్పుడు వారు  " దేవా !  మేము చిరకాలము జీవించునట్లు  యుద్దములో ఎంతటి శత్రువునైనా జయించి  అజేయులుగా నిలుచునట్లు  అనుగ్రహింపుము . అంతే కాక  మేము  సర్వసమర్థులమై  పరస్పర ప్రేమానురాగములతో ఉండునట్లు వరములు ప్రసాధింపుము .  "  అని కోరెను . అప్పుడు బ్రహ్మదేవుడు  సుఖేశ తనయులు కోరినట్లుగా  వరములను ప్రసాదించి  సత్యలోకమునకు వెళ్లెను .  
రామా! ఇట్లు వరములు పొందిన పిమ్మట  ఆ ముగ్గురు సోదరులు  నిర్భయులై  దేవతలను,   రాక్షసులను  సకల ప్రాణులను  భాదింప సాగిరి .  ఆ రాక్షులు పెట్టె బాధలకు తాళ లేక  దేవతలు , మహర్షులు  , మున్నగువారు  విలవిల లాడసాగిరి .  రఘువరా! ఇది ఇట్లు ఉండగా  ఎక్కడనూ తమకు ఎదురులేక పోవుటచే  ఆ రాక్షసులు  హర్షోత్సాహములతో పొంగిపోవుచుండిరి .  ఒక రోజు వారు  శిల్పులలో అగ్ర గణ్యుడైయిన   విశ్వకర్మ  వద్దకు వెళ్లి  ఆయనతో  "  మహాత్మా !  నీవు గృహ నిర్మాణము  న  అత్యంత ప్రతిభాశాలివి .  కనుక  వెంటనే  హిమవత్పర్వతముపై కానీ , మేరుపర్వతముపై కానియూ , ఒక విశాలమైన  భవనమును మాకు నిర్మించి ఇవ్వుము . అది పరమేశ్వరుడి   భవనమువలె  వైభవముగా  ఉండవలెను ."  అని  అభ్యర్ధించిరి . అప్పుడు విశ్వకర్మ వారితో " సజ్జనులారా ! దక్షిణ సముద్ర తీరమున  త్రికూటము అనుపర్వతము కలదు .  ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారము .  నేను  ఆ పరవతముపై   లంకా నగరమును నిర్మించితిరి  . అది  ముప్పది యోజనముల వెడల్పు  పది యోజనముల పొడవు కలిగినది . దాని చుట్టూ  బంగారు ప్రాకారములతో  బంగారపు  ద్వారములతో  ఉన్నది . " అని తెలిపెను . అప్పుడా రాక్షసులు  విశ్వకర్మ సూచనలను  అనుసరించి  వేళా కొలది అనుచరులతో  ఆ పురమున నివసింప సాగిరి . ఆ  లంకా నగరము  దృఢమైన ప్రాకారములతో  అగడ్తలతో  ఉన్నది .  దానిలో  వందల కొలది బంగారు గృహములు కలవు .  అట్టి లంక  యందు  మాల్యవంతాది రాక్షసులు సంతోషముగా నివసింపసాగిరి . 
ఆ కాలములోనే  నర్మద  అనే ఒక గాంధర్వ స్త్రీ ఉండెడిది . ఆమె  తన ముగ్గురు కుమార్తెలైన  సుందరి, కేతుమతి, వసుధ  లను  వరుసగా  మాల్యవంతుడు , సుమాలి , మాలి , లకు ఇచ్చి వివాహము చేసెను . మాల్యవంతుడికి  వజ్రముష్టి , విరూపాక్షుడు , దుర్ముఖుడు , సుఖఃతజ్ఞుడు  , యజ్ఞ కోపుడు , మత్తుడు, ఉన్మత్తుడు  అనే ఏడుగురు కుమారులు కలిగిరి . సుమ్మలికి  ప్రహస్తుడు , అకంపనుడు , వికటుడు, కాలాకార్ముఖుడు, ధూమ్రాక్షుడు , దండుడు, సుపార్శ్వుడు , మహాబలుడు , సంఖ్యత్రి  , ప్రఘసుడు , బాసకర్ణుడు , అను పదకొండుమంది కుమారులు కలిగిరి . మాలికి  అనిలుడు , నలుడు , హరుడు , సంపాతి, అను నలుగురు కుమారులు కలిగిరి . మిక్కిలి బలపరాక్రమములు  కలిగి ఉండుడుట చే   అనేక పుత్రులచే  గావితులైన  ఆ ముగ్గురు రాక్షసులు  ఇంద్రాది దేవతలను  ఋషులను , నాగులను , యక్షులను , మిక్కిలి బాధింప సాగిరి . ఆ  రాక్షసులు రానా అంగముయందు . తిరుగు లేని వారై   స్వామిరా విహారం ఒనర్చుచుండిరి . ఆ  రాక్షసులు  అన్ని లోకములు తిరుగుతూ  యజ్ఞ యాగాదులను ధ్వంసము చేయు చుండిరి . 

రామాయణము --------ఉత్తరకాండ --------అయిదవసర్గ ----------సమాప్తము . 

శశి, 

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) , తెలుగు పండితులు .    












No comments:

Post a Comment