Tuesday 12 May 2020

రామాయణము ఉత్తరకాండ-----------ఎనిమిదవసర్గ

                                    రామాయణము 

                                  ఉత్తరకాండ-----------ఎనిమిదవసర్గ 

అగస్త్య మహర్షి  శ్రీ రాముడు తో " రామా ! పారిపోవుచున్న రాక్షసభలములను  విష్ణు మూర్తి  వెంటాడి చంపుతుండగా  మాల్యవంతుడు కోపంతో వెనుతిరిగి "  దేవా! యుద్ధవిముఖులై  ఉన్నవారిని చంపుట మహా పాపము క్షత్రియ ధర్మమును ఎరుగవా  ఏమి ? అంతగా నీకు యుద్ధము చేయవలెనని  ఉన్నచొ  నాతో యుద్ధము చేయుము " అని పలికెను . అప్పుడు  విష్ణువు  " రాక్షసులను రూపుమాపెదను  అని నేను అభయమిచ్చెను . అందువలన నేను నా వాగ్దానమును పాటించుచున్నాను .  మీరు పాతాళములో దాగిన నేను ముమ్మలను మాటు పెట్టక  మానను . " అని పలికెను  . అప్పుడు మిక్కిలి కోపంతో  మాల్యవంతుడు   తన ముష్టిఘాతం  తో  శ్రీహరి ని  గరుత్మంతుణ్ణి బలముగా కొట్టి  నాలుగు మొరల దూరము వెనక్కి   తగ్గెను . అప్పుడు గరుత్మంతుడు  కోపంతో  తన రెక్కల గాలితో  మాల్యవంతుడిని ఎగర గొట్టెను . ఎగిరి పోయిన తన అన్నను  చూసి  వెంటనే సుమాలి  తన బలములతో కూడి  లంకకు పారిపోయెను . గరుత్మంతుని రెక్కల దాటికి ఎగిరి పోయిన మాల్యవంతుడు  సిగ్గు తో తల వంచుకొని  లంకకు పోయెను . రామా!  ఆ శ్రీ హరిచే అనేక మంది రాక్షసులు మరణించిరి . విష్ణువును యుద్దములో ఎదిరింపలేక శక్తిహీనులై మిగిలిన రాక్షసులు భయముతో లంకను వదిలి ,తలదాచుకొనుటకై పత్నులతో సహా పాతాళలోకమునకు వెళ్లిరి . ఇంతవరకు రాక్షసులయొక్క పుట్టుపూర్వోత్తరముల గురించి నీకు వివరముగా చెప్పితిని . ఇప్పుడు రావణుని యొక్క అతని కుమారుల  యొక్క జన్మ వృత్తాంతములను తెలిపెదను వినుము . విష్ణువుకు బయపడి కలత చెందిన సుమాలి తన వారైన రాక్షసులతో ,పుత్ర పౌత్రులతో కలిసి చిరకాలము పాలాలోకములోనే ఉండసాగెను . అప్పుడు బలశాలి ఐన కుబేరుడు లంకను తన ఆవాసముగా చేసుకొనెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








No comments:

Post a Comment