Saturday 2 May 2020

రామాయణము యుద్ధకాండ ------నూటపదకొండవ సర్గ

                                            రామాయణము 

                                          యుద్ధకాండ ------నూటపదకొండవ సర్గ

అప్పుడు మాతలి  శ్రీ రాముడితో " ప్రభూ!  ఇతడిని చంపుటకు  బ్రహ్మాస్త్రమును  ప్రయోగింపుము  "  అని పలికెను . మాతలి పలుకులు  విన్నవెంటనే  శ్రీ రాముడికి  బ్రహ్మాస్త్రము  జ్ఞప్తికి  వచ్చెను  ఈ అస్త్రమును  అగస్త్య మహాముని  శ్రీ రాముడికి ఉపదేశించెను . శ్రీ రాముడు  వేద మంత్రములతో   విద్యుక్తముగా  అభిమంత్రించి  ఆ బ్రహ్మాస్త్రమును  రావణుని పై ప్రయోగించెను .  అది రావణుని వక్షస్థలములో  గుచ్చుకొని  రావణుని ప్రాణములను  హరించెను . రావణుని హతమార్చిన  పిమ్మట  రక్తముతో  తడిసిఉన్న  ఆ శరము  పని ముగించుకొనిన  వినమ్ర  సేవకునివలె  తిరిగి శ్రీ రాముని తూణీరమునకు  చేరెను .  రణ రంగములో  చావగా మిగిలిన రాక్షస యోధులు  దిక్కులేనివారై  మిక్కిలి భయపడుతూ  ఏటువారటు  పారిపోయిరి . వానరులు  శ్రీ రామునికి జైజైలు పలికిరి  దేవతల దుందుభులు మ్రోగినవి .  సువాసనలతో  కూడిన గాలి హాయిగా  వీచింది . శ్రీ రాముడిపై  పుష్ప వర్షము కురిసినది దేవతలు మహాత్ములు , శ్రీ రాముని పొగిడిన  ప్రశంసలు  వినబడినవి  సుగ్రీవుడు  విభీషణుడు  మున్నగు వారు  శ్రీ రాముని ప్రశంసించి , పూజించిరి . వానర యోధులందరు సంతోషంతో పెద్దపెద్ద ధ్వనులు చేస్తూ  గంతులేయుచూ           నృత్యములు చేసిరి . 

రామాయణము --------యుద్ధకాండ -------------నోటపదకొండవ   సర్గ ------------సమాప్తము. 

శశి, 

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ) , తెలుగు పండితులు . 







No comments:

Post a Comment