Wednesday 6 May 2020

రామాయణము యుద్ధకాండ ----------నూటఇరువదిఐదవసర్గ

                                          రామాయణము 

                                     యుద్ధకాండ ----------నూటఇరువదిఐదవసర్గ 


పిమ్మట విభీషణుడు  శ్రీ రాముడికి నమస్కరించి "ఇంకా నేను ఏమి చేయవలెను . " అని అడిగెను . అప్పుడు శ్రీ రామూడు  విభీషణుడితో "  విభీషణ ! ఈవనరులు అసాధ్యమైన ఈయుద్దము నందు  సర్వశక్తులను  ఒడ్డి పోరాడియే  కనుక వీరిని  అమూల్యమైన వస్త్రాభరణములతో సన్మానించుము  నీవు అట్లు చేసినచో ఈ కపియోధులు పొంగిపోవుదురు . " అని పలికెను . శ్రీ రాముడు  ఇట్లు పలికిన పిమ్మట  విభీషణుడు వానరుల అందరిని వారివారి యోగ్యతలకు తగినట్లుగా రత్నములతో ధనముతో , సత్కరించెను పిమ్మట శ్రీ రాముడు సీతాదేవి  లక్ష్మణుడితో కలిసి పుష్పకవిమానమును అధిరోహించెను అప్పుడు సరే రాముడు తనని చూస్తున్న సుగ్రీవుడితో , విభీషణుడితో, వానరులతో , " ఓవానరోత్తములారా !  మీరందరు  నాకు ఎంతగానో సహాయపడితిరి మీ సహాయములకు నా ధన్యవాదములు . ఇక మీరందరు మీ ఇష్టానుసారం స్వేచ్ఛగా  మీమీ స్థానములకు చేరుటకై అనుమతించుచున్నాను . సుగ్రీవా ! ఇకనీవు  నీసైన్యముతో కలిసి కిష్కింధకు తిరిగివెళ్ళము విభీషణ  ఈ లంకారాజ్యమున  నీవు హాయిగా నివసింపుము ముతృలారా  నేను అయోధ్యకు  తిరిగివెళ్ళుటకు అనుమతిమపుము అనిపలికెను . " 
శ్రీ రాముడీమాటలు విన్న సుగ్రీవాది వానరోత్తములు విభీషణుడు , ఆయనకు నంస్కలించి ప్రభూ మేము కూడా మీతో అయోధ్యకు వచ్చుటకై కుతూహలపడుచున్నాను నీవు పట్టాభిషిక్తుడవు అగు చుండగా చూడవలెనని నా కోరికా అది చూసి కౌసల్యా మాతకు ప్రణమిల్లి  తిరిగి మా గృహములకు చేరెదము . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు " మిత్రులారా యుద్ధమున రావణుడను జయించి  నేను సీతను పొందుట  ఎంతో ప్రీతిని కలింగించే  విషయము వనవాస దీక్షను ముగించుకొని సకాలములో  భరతుణ్ణి దర్శించడం అంతకంటే ప్రాథికారమైన డి సహృదయులైన్మెఈఆండ్రితో కలిసి అయోధ్యలో అడుగిడుట వీటన్నిటికంటే ప్రియాతిప్రియము వానరేన్ద్ర ! సుగ్రీవ  వనరులతో కలిసి త్వరగా ఈవిమానమును ఎక్కుము . విభీషణ  నీ అమాత్యులతో కలిసి నీవు కూడా ఈవిమానమును వెంటనే ఎక్కుము . అని అప్లికేను అప్పుడు తన సేనలహాతో కూడి సుగ్రీవుడు అమ్మాఅత్యులహాతో కూడి విభీషణుడి ఆ పుష్పక విమానమును త్వరత్వరగా ఎక్కిరి . ఆ విమానములో వారందరు ఆసీనులైనవెంటనే శ్రీ రాముడి అనుమతితో అది ఆకాశము లోకి ఎగిరెను . మహా బలశాలురైన వానర భల్లూకారుడు  , ఆరాక్షుసులు అందరూ ఆ విశాలమైన  దివ్యమైన విమానంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖముగా కూర్చుండిరి .  

రామాయణము ---------------యుద్ధకాండ---------నూటఇరువదిఐదవసర్గ -------సమాప్తము . 

శశి, 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగు పండితులు . 
























No comments:

Post a Comment