Tuesday 12 May 2020

రామాయణము ఉత్తరకాండ ----------ఆరవసర్గ

                                       రామాయణము 

                                        ఉత్తరకాండ ----------ఆరవసర్గ 

మాల్యవంతాది రాక్షసులచే  చావు దెబ్బలు తిన్న  దేవతలు,  తపఃసంపన్నులు,  ఋషులు , గడగడా                   ఒనికిపోవుచూ  పరమేశ్వరుని  శరణువేడిరి .  అప్పుడు పరమేశ్వరుడు సుఖేసుని పై  అభిమానము ఉన్నందున  తనను శరణువేడిన వారితో"  దేవతలారా  నేను ఆ అసురులను చంపను  కానీ  ఆ అసురులను  అంతమొందించే మార్గము చెబుతాను వినుము . మీరందరు శ్రీ మహావిష్ణువద్దకు వెళ్లి  ఆయనను సరను వేడుము . ఆయనే  ఆ రాక్షుసులను చంపుటకు  సర్వసమర్దుడు .  "  అని పలికెను  . 
పిమ్మట  ఆ దేవతలు,  ఋషీశ్వరులు , అందరూ  విష్ణు మూర్తి  వద్దకువెళ్లి  ఆయనను శరణుజొచ్చిరి .  జగద్పా పాలకుడైన  ఆ ప్రభువు  ఆ రాక్షసులను పరిమార్చుతానని  వారికి భయము ఇచ్చెను .  నిశాచరుడైన మాల్యవంతుడు దేవతల ప్రయత్నములు  అన్ని  తెలుసుకొని  తన సోదరులతో"  సోదరులారా! దేవతలు, ఋషులూ కలిసి మనల్ని పరిమార్చమని  పరమేశ్వరుణ్ణి అభ్యర్ధించారు . పిమ్మట వారు  ఆ పరమేశ్వరుడి సలహా తో  శ్రీ మహా విష్ణువుని శరణు  వేడిరి . ఆ ప్రభువు  మనల్ని  హతమారుస్తానని   అభయము ఇచ్చినాడట  తమ్ములారా ! ఆ శ్రీ హరి  చేతిలో  హిరణ్యకశిపుడు , నముచి , కాలనేమి , సంహారాధుడు , రాధేయుడు , యమలార్జునులు , హార్ధిక్యుడు , శంభుడు , నిశింభుకుడు , మొదలగువారందరు మరణించిరి . ఆయనతో  తలపడిన వారెవ్వరు  విజయులు అయ్యినట్లుగా మనము విని ఉండలేదు .  కావున  ఈ విషయములన్నిటినీ దృష్టిలో ఉంచుకొని  మనందరికీ  శ్రేయస్కరమైన ఉపాయము గూర్చి ఆలోచింపుము  . " అని పలుకగా  అప్పుడు  సుమాలి, మాలులు , " అన్నా ! మనము వేదములను అధ్యయనము చేసితిమి . దానధర్మములు చేసితిమి . యజ్ఞయాగాదులను చేసితిమి .  ఐశ్వర్యమును అనుభవించితిమి రాజ్యమును పరిపాలించుచున్నాము . అనారోగ్యమునకు తావు లేని ఆయుర్దాయము పొందితిమి . కనుక  మనకు  మృత్యుభయము ఏమాత్రము లేదు .  యముడు  , ఇంద్రుడు , రుద్రుడు , చివరికి నారాయణుడు కూడా మన ముందు నిలబడుటకే భయపడుదురు . మనపై  శ్రీ హరికి  ద్వేషముండుటకు కారణమేమియూ లేదు .  దేవతల వలనే  ఇప్పుడాయనకు  మన మీద కోపము కాజాలింది .  కాబట్టి  మనమందరమూ  సైన్యముతో సహా దండెత్తి  దేవతలని చంపి వేద్దాము . "  అని పలికిరి . 
వెణు వెంటనే రాక్షసులు అందరు తమ తమ సైన్యములతో సహా  దేవతల పై  దండెత్తిరి . అప్పుడు దేవతలు  బ్రతుకు జీవుడా అని పారిపోయిరి . ఇది తెలుసుకొన్న శ్రీ మన్నారాయణుడు   వారితో యుద్దముకై సిద్దపడి గరుత్మంతుని పైకి ఎక్కి అక్కడికి వచ్చెను.  ఆలా వచ్చుచున్నపుడు గరుత్మంతుని రెక్కల  గాలిదాటికి  వారి రాధములపై  గల ధ్వజ పటములు ఎగిరి పోసాగెను . అస్త్రములు అన్ని  చెల్లాచెదురై  పోయెను . 


రామాయణము --------ఉత్తరకాండ ----------ఆరవసర్గ ---------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ), తెలుగుపండితులు . 






















No comments:

Post a Comment