Tuesday 12 May 2020

రామాయణము ఉత్తరకాండ ---------ఏడవసర్గ

                                        రామాయణము 

                                          ఉత్తరకాండ ---------ఏడవసర్గ 

రాక్షసులు  వెణు వెంటనే  విష్ణు మూర్తిపై  శరముల వర్షము కురిపించే సాగెను .  రాక్షసుల ధనస్సుల  నుండి బయటకు వచ్చిన శరములు  ప్రళయకాలంలో  లోకముల వలే ఆ స్వామిలో  లీన మగుచున్నవి .  విష్ణు మూర్తి  రాక్షసులపై  సరములను ప్రయోగించి  ఆ రాక్షసులను చెండాడసాగెను .  అప్పుడు సుమాలి  యుద్ధరంగములో  శ్రీ హరికి ఎదురుగా నిలబడి  తన బాణ వర్షము చే  ఆయనను కప్పివేసెను .  అది చూసి  ధైర్యము తెచ్చుకున్న  మిగిలిన రాక్షసులు  కూడా  తమతమ  అస్త్ర  సస్త్ర ములను శ్రీ హరిపై  ప్రయోగించసాగిరి . అప్పుడు శ్రీ హరి సుమాలి యొక్క సారధి  శిరస్సును చేధించెను .  అప్పుడు  సుమాలి యొక్క రధాశ్వములు  దారి తప్పి  సుమాలి రధమును లాగుకొని దూరముగా  పోయెను . అప్పుడు మాలి  శ్రీ హరికి ఎదురుగా నిలబడి  యుద్ధము చేయనారంభించెను .  అది చూసిన విష్ణు మూర్తి  అతని పై బాణ వర్షము కురిపించెను . పిమ్మట  విష్ణువు  అతని ధనస్సును,  రధాశ్వములను,  ధ్వజపతాకములను,  చివరికి కిరీటమును  తన బాణములచే నేల పాలు చేసెను . అప్పుడు  రధము ను కోల్పోయిన మాలి  గధను తీసుకొని  విష్ణువు పైకి దూకి  గరుత్మంతుని నుదుటి బాగముపై బలముగా కొట్టెను . అప్పుడు  రాక్షసులంతా  కోలహాల ధ్వనులు చేసిరి . దానితో  కోపించిన విష్ణువు  సుదర్శనచక్రమంతో మాలి శిరస్సును కండించెను .  శ్రీ హరి చేతిలో  మాలి హతుడగుట చూసి  వంటనే  పెక్కుమంది రాక్షసులు ,ఇంకా సుమాలి, మాల్యవంతుడు  తమ బలములతో సహా లంకకు పరుగులు తీసిరి . విష్ణు చక్రము యెక్కదాటికి  కొంత మంది రాక్షసుల ముఖములు ఛేదించబడెను . గదాయుధమునకు  మరికొంతమంది వక్షస్థలములు  నుగ్గునుగ్గుఅయ్యెను . నాగలి దెబ్బలకు కొంతమంది కంఠములు తెగిపడెను .  రోకలి పోటులకు కొందరి తలలు  పగిలిపోయెను . ఖడ్గమునకు కొందరు బలిఅయ్యిరి .  మిగిలిన వారు సరాగధములచే మిక్కిలి గాయపడిరి . ఆస్తితిలో  బతికి ఉన్న రాక్షసులు తమ  ప్రాణములను  కాపాడుకొనుటకై  శక్తి కొలది పరుగులు తీసిరి . 

రామాయణము --------ఉత్తరకాండ ----------ఏడవసర్గ -------సమాప్తము . 

శశి, 

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 











No comments:

Post a Comment