Wednesday 13 May 2020

రామాయణము ఉత్తరకాండ ---------పదవసర్గ

                                       రామాయణము 


                                           ఉత్తరకాండ ---------పదవసర్గ 

అప్పుడు శ్రీ రాముడు అగస్త్య మహర్షిని " మహాత్మా ! మిక్కిలి  బలశాలురైన ఆ  సోదరులు  ఎంత కఠోరంగా తపస్సు  చేసిరి . వారి తపశ్శచ్యర్య  విధానములు  ఎట్టివి  " . అని  అడిగెను . అప్పుడా మహర్షి "రఘురామా ! ఆ రాక్షస సోదరులు  ముగ్గురు ధర్మ విధులను అనుసరించుచు  వేరువేరు  రీతులలో తపస్సు ను ఆరంభించిరి . 
విభీషణుడు  వేసవికాలంలో  మండుటెండల్లో  నాలుగువైపులా  అగ్నిని ఉంచుకొని . సూర్యుడివైపు  చూస్తూ  తపస్సు చేయ సాగెను . వర్షాకాలంలో ఆరుబయట కూర్చొని  జడివానలో సైతం తపస్సు  చేసెను . చలికాలములో నీళ్లలో ఉండి  తపస్సు చేసెను . అతడు ధర్మమునందు  దృఢ మనస్కుడై పదివేల   సంవత్సరములపాటు  తపస్సు  చేసెను . 

ధర్మాత్ముడైన  విభీషణుడు  పవిత్రముగా తాపస  ధర్మములు  ఆచరించుచూ  తపస్సు చేసెను . అతడు  చివరి  ఐదువేల   సంవత్సరములు  శిరస్సును  బాహువులను  పైకెత్తి సూర్యుడిని  వీక్షించుచూ  వేదమంత్రములు పటించుచూ  ఒంటి కాలిపై దృఢ నిశ్చయముతో  తపస్సు చేసెను . 
పదివేల సంవత్సరములు  నిరాహార దీక్షతో  రావణుడు  తపస్సు చేసెను . ప్రతి   వేయి  సంవత్సరములకు  ఒక సారి  అతడు తన శిరస్సును  నరికి  అగ్నికి ఆహుతి ఇచ్చుచుండెను . ఈ  విధముగా  తొమ్మిదివేల సంవత్సరములు  తపస్సు  గడుచునప్పటికీ  తొమ్మిది  శిరస్సులు  అగ్నుకి ఆహుతి అయ్యెను . మిగిలిన వేయి సంవత్సరములు  ముగియు సమయమున  అతడు  తన పదవ  శిరస్సును  చేధించుటకై  సిద్దపడుచుండగా  బ్రహ్మ దేవుడు  దేవతలతో  కలిసి ప్రత్యక్షమయ్యెను .  అప్పుడు బ్రహ్మ దేవుడు  రావణునితో " దశాననా  ఇంతవరుకు నీవు  చేసిన  గోరా తపస్సుకు  నేను ప్రసన్నుడనైతిని . ఒక  వరము కోరుకొనుము .  ఇప్పుడే నెరవేర్చెదను ".  అని పలికెను . 
అప్పుడు దశగ్రీవుడు  బ్రహ్మ దేవునకు  శిరసాప్రణమిల్లి  హర్షపూర్ణమైన  గద్గద స్వరముతో " మహాత్మా  సమస్త  ప్రాణులు  నిత్యము  మరణభీతితో  తొట్రుపడుచుండును . ఈ లోకమున  మృత్యువుతో సమానమైన శత్రువు ఉండదు కావున నేను  అమరత్వము కోరుకొనుచున్నాను . " అని ప్రార్ధించగా  బ్రహ్మ దేవుడు  " రావణ ! పూర్తిగా అమరత్వము ప్రాప్తించుట అసాధ్యము . కనుక  నీవు మరొక వరము  కోరుకొనుము . అని పలికెను అప్పుడు రావణుడు" పితామహా !యక్ష, నాగ , గరుడ, దేవా, దానవులు  మున్నగు వారి వలన  నాకు మరణము లేకుండునట్లు అనుగ్రహింపుము . ఇతర ప్రాణులవలన  నాకు ఎట్టి  భయము లేదు . మానవులు నాకు గడ్డి పోచతో సమానము . " అని అభ్యర్ధించెను . అప్పుడు బ్రహ్మ దేవుడు  " రాక్షస పుంగవా  నీవు కోరిన రీతిగా  ఈ వరమును అనుగ్రహించుచున్నాను . తపోధన మిక్కిలి సంతుష్టుడ నైన  నేను నీకు మరోవారం కూడా ఇచ్చుచున్నాను . అది ఏమనగా నీవు ఇంతకు ముందు  అగ్నిలో వేసిన నీ తొమ్మిది  శిరస్సులు ఏడ తదముగా ఏర్పడును . అని పలికెను . 
పిమ్మట బ్రహ్మ దేవుడు విభీషణుడితో  " నాయనా విభీషణ  చక్కని నీ తపో దీక్షకు సంతుష్టుడ నైతిని . కనుక నీకు నచ్చిన వారము కోరుకొనుము . " అని పలుకగా విభీషణుడు , బ్రహ్మ దేవునితో "పూజ్యుడా నేను  ఎంతటి ఇక్కట్లు పాలైనను నా బుద్ది  ధర్మమును వీడక దృఢముగా ధర్మమూ నందే  ఉండునట్లు దీవించుము . " అని పలికెను . 
విభీషణుడు పలికిన పరమ ధార్మిక వచనములను  బ్రహ్మ దేవుడు ఎంతో  ప్రీతితో " విభీషణ నీవు  ప్రబలమైన ధర్మనిష్ఠ కలవాడవు . నీవు కోరినట్లు  జరుగును . నీవు రాక్షసవంశమున జన్మించినా  నీ బుద్ది ఎప్పుడు అధర్మమును తాకదు . నీకు  అమరత్వము  ప్రాప్తించును . " అని పలికెను . 
కుంభ కర్ణునికి  వరమిచ్చుటకు  సిద్ధపడిన  బ్రహ్మ దేవుడితో  దేవతలందరు " స్వామి  కుంభకర్ణునికి వరమిచ్చుట యుక్తము కాదు . ఈ దుష్టుడు లోకములను ఎంతగా గడగడ లాడించున్నాడో నీకును తెలుసును . మహాత్మా ! నందన వనములో ఏడుగురు అప్సరసలు , ఇంద్రుని అనుచరులు పదిమందిని అలాగే అనేక మంది  ఋషులను మనుష్యులను ఇతడు భక్షించి వేసెను .  వరములు  పొందకముందే ఇటువంటి దుష్కార్యములకు వొడిగట్టినాడు  . ఇక వారములు పొందితే  ముల్లోకములను తిని వేయగలడు . దివ్య తజస్వి  వరము  నెపముతో ఇతనికి మోహము కలిగించుము . అలా చేసినచో  లోకములకు మంచి జరుగునూ , అతడి అభీష్టములు నెరవేరును . అని పలికెను . దేవతల మానవుని ఆలకించిన బ్రహ్మ దేవుడు క్షణకాలం  ఆలోచించెను . పిమ్మట అతడు సరస్వతీ దేవిని  స్మరించెను . వెంటనే  ఆ దేవి ప్రత్యక్షమై దేవా ! కర్తవ్యమును తెలుపుము . అని పలికెను . అప్పుడు బ్రహ్మదేవుడు "వాణీ ! దేవతల ప్రార్ధనను మన్నించి  నీవు  ఈ కుంభకరుణుని  నాలిక పై  ప్రవేశింపుము . " అని  పలికెను . ' అట్లే 'అని ఆమె ఆ రాక్షసుని నాలిక పై ప్రవేశించెను . పిమ్మట బ్రహ్మదేవుడు  కుభర్ణునితో " మహాబాహూ ! నీ అభీష్టాను సారము ఒక వరమును కోరుకొనుము అని పలికెను . అప్పుడు కుంభకర్ణుడి దేవదేవా !  నేను పెక్కు సంవత్సరములు నిద్రించునట్లు వారములు ప్రసాదింపుము . " అని ప్రార్ధించెను . అప్పుడు బ్రహ్మ దేవుడు  తధాస్తు అని పలికి దేవతలతో కలిసి వెడలి పోయెను . పిమ్మట సరస్వతీ దేవికూడా  అతడిని విడిచివెళ్లిపోయెను . అప్పుడు 
కుంభకర్ణుడు  మోహవిముక్తుడై  సహజస్థితికి  వచ్చెను .   పిమ్మట కుంభకర్ణుడు ' నేను ఇట్టి వరము  కోరుకుంటిని ఏమి ఇది దేవతల మాయ అయ్యి  ఉంటుంది ' అని తనలో తాను  అనుకొనెను . పిమ్మట ఆ ముగ్గురు  సోదరులు  శ్లేష్మాతకము  అను పేరుగల  తన తండ్రివనమునకు వెళ్లి . అచట హాయిగా నివసించసాగిరి . 


రామాయణము ----------ఉత్తరకాండ -----------పడవసర్గ ------------సమాప్తము . 

శశి.,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు . 











No comments:

Post a Comment