Thursday 7 May 2020

రామాయణము -------- యుద్ధకాండ ----------నూటఇరువదియేడవసర్గ

                                       రామాయణము 

                               యుద్ధకాండ ----------నూటఇరువదియేడవసర్గ 

చైత్రశుద్ద  పంచమి నాటికి  శ్రీరాముని  వనవాస  దీక్ష  ముగియబోవుచుండగా  ఆనాడు  శ్రీ రాముడు తనువెళుతున్న పుష్పకవిమానమును భరద్వాజముని  ఆశ్రమువద్ద దింపి  ఆశ్రమములోకి వెళ్లి  ఆ మహామునికి  నమస్కరించెను .  అప్పుడు  శ్రీ రాముడు భారద్వాజ మునితో "  మహాముని  మీరుక్షేమమే  కదా  మీతపస్సు  చక్కగా సాగుచున్నది కదా , అయోధ్యా నగరము నందలి ప్రజలు  సుఖసంతోషాలతో ఉన్నట్లుగా  వార్తలు  మీరు ఏమైనా విన్నారా?   భరతుడు  రాజ్యమును చక్కగా పరిపాలించుచున్నాడు కదా తల్లులందరును  సుఖసంతోషములతో ఉన్నారుకదా  " అని అడుగగా భరద్వాజ ముని శ్రీ రామునితో చిరునవ్వు చిందించుచూ  "రామా ! భరతుడు  జటాధారి అయి  దీక్షతో నీరాక కోసము ఎదురుచూచుచున్నాడు అతడు  నీ పడుకులను ముందుంచుకొని  రాజ్యపరిపాలన  కావించుచుండెను . అంతఃపుర వాసులే కాకా  పరజలందరూ కూడా  సంతోషముగా ఉన్నారు . నేను నా దివ్య దృష్టితో  నీవు వనవాస సమయములో మునులను దర్శించుట తాపసులనును  దర్శించుట  సీతాదేవిని రావణుడు అపహరించుట, సుగ్రీవుడితోస్నేహము, వాలివధ , సీతాన్వేషణ , మహాసాగరముపైవారధిని  నిర్మించుట, రవాణా సంహారము వీటన్నిటిని  నేను ఎరుగుదును .  ఓ రామా!  ఇప్పుడు నేను సంతోషముతో   వారము ఇవ్వకోరుచున్నాను  ఏంకావాలాకోరుకో " అని పలికెను .  
అప్పుడు శ్రీరాముడు  " మహాముని  అన్నికాలాలలోను  ఇక్కడ కల వృక్షములు   మధురములైన  ఫలములను ఇచ్చుగాక నేను  అయోధ్యకు పయనించునపుడు  నా వెంట ఉన్న  వారాధివీరులందరికి  ఫలములు  కోకొల్లలుగా లభించుగాక  " అని అడిగెను అప్పుడు  భరద్వాజ ముని ఆ వరమును ఇచ్చెను  ఆ వార ప్రభావముచే   పూలులేని  చెట్లన్నీ, పూలతో కళకళలాడెను, ఫలములు లేని చెట్లన్నీ ఫలములతో నిండెను , మోడువోయిన చెట్లన్నీ పచ్చటి ఆకులతో కళకళ లాడెను . అక్కడి నుండి  అయోధ్యకువెళ్ళు మార్గము వరుకు  కూడా  దారిలో ఉన్న చెట్లన్నీ కూడా ఇట్లే  ఫల , పుష్ప, తేనెలతో నిండిపోయెను . అవి చూసిన వానరులు  ఎంతో సంతోషించి ఆ దివ్య  ఫలములను  తనివి తీరా భక్షించిరి . 

రామాయణము------ ----యుద్ధకాండ------ ----నూటఇరువదియేడవసర్గ ------------సమాప్తము  












No comments:

Post a Comment