Friday 8 May 2020

రామాయణము యుద్ధకాండ ----------నూట ముప్పదియవసర్గ

                             రామాయణము 

                      యుద్ధకాండ ----------నూట ముప్పదియవసర్గ 

భరతుడు హనుమనాథుడు పలికిన సుభవంచనములు విన్న  శత్రుజ్ఞుడితో  తమ్ముడా  !  కులదైవతలను , దైవ మందిరములను  మార్గ  కూడళ్లలో గల  మండపములను , పరిమళభరితమైన పూలమాలాహ్తో  అలంకరించి , వీణా  వేణు , మృదంగ ధ్వనులతో , నింపండి  .  స్తుతులను పురాణాలను బాగుగా ఎరిగిన సూక్తులు , అలాగే వందిమాగధలను . దేవదాసులను మొదలగువారందరు సామూహికంగా  శ్రీ రాముడిని దర్శించితుకై  బయలుదేరమని ఆజ్ఞపించండి .  వెంటనే శత్రుజ్ఞుడు  వేళా కొలది సేవకులతో "  వీరులారా  నంది గ్రామము నుండి అయోధ్యవరకుకల  మార్గమునందలి మెత్తపల్లములను  సరిచేయుము  .  అన్ని ప్రదేశాలను శుభ్రపడుచుము దారిఅంతా చల్లటి నీటిహోతడుపుము ఆదారిలో పుష్పములను  పరుచుము . సూర్యుదయము లోపల  అయోధ్యానగరములోని  , రాజవీధులన్నియూ  ధ్వజపతాకములతో  అలరాలవలెను , సకల భావనములను  పూలతోరణములహాతో చక్కగా  అలంకరింపుము .  సమస్తరాజవీధుల్లో అందమైన ముగ్గులు వేయించి వాటిపై విడిపూలుచల్లుము . అని  అగ్న్యా పించెను . 
రాజమాతలు అమాత్యులు , అంతఃపుర రక్షకులు , సైనికులు పురస్తీలు, బ్రాహ్మణులూ , రాజకుమారులు వివిధవర్గములకు చెందిన పుర ప్రముఖులు , దృష్టి , జయంతుడు , విజయుడు, సిద్దార్థుడు , అరగసాధకుడు , అశోకుడు , మంత్రపాలుడు, అను అష్టమంత్రులు , బంగారు ఆభరణములతో అలంకరింపబడిన , వేళా కొలది మాడపాటియేనుగులు  వెంట వచ్చుచుండగా  బయలుదేరిరి .  అలాగే  ప్రముఖ రాధికులు అంతరంగికులు , మాడపాటి  ఏనుగులను , అశ్వములను రథములను , ఎక్కి బయలుదేరిరి .  పిమ్మట  వేలకొలది అశ్వముల  తొడను  బల్లెములు  , కత్తులు , ఈటెలు , మున్నగు ఆయుధములను చేబూనిన అసంఖ్యాక పాదాది దళములతోడును , ముఖ్యులగు పుర ప్రముఖులతోడగు , వీరులు  శ్రీరాముని ఆహ్వానించుటకై  ఎదురైరి . సుమిత్రా , కైకేయి , మొదలగు దశరధ మహారాజు యొక్క పత్నులు  కౌసల్యాదేవి పల్లకిని అనుసరించుచుడూ పల్లకీలలో నంది గ్రామము చేరిరి  ఇంతలెందుకు , ఆయుధ్యాపురవాసులందరూ నందీ గ్రామమునకు పయనమయ్యిరి . గుఱ్ఱముల యొక్క గిట్టల చప్పుళ్లతోను , రథచక్రపుటంచుల సవ్వడులతో ,శంఖదుందుభి నాదములతో భూమి కంపించినట్టాయెను . తీపిపదార్థములను తీసుకుని వశిష్టాదులు కూడా నంది గ్రామమునకు బయలుదేరిరి . భరతుడు శ్రీరాముని పాదుకులను శిరస్సున దాల్చి మంత్రులతో కూడి శ్రీరామునికి స్వాగతము పలుకుటకై బయలుదేరెను . 
అలా అందరూ నందీ గ్రామములో శ్రీరాముడి కొరకు ఎదురు చూస్తూ ఉండగా హనుమ భరతునితో "భరద్వాజమహర్షి శ్రీరామచంద్రప్రభుకు ,ఆయన సైన్య పరివారమునకు షడ్రసోపేతమైన ఆతిధ్యమును ఇచ్చినాడు . మహాత్మా !అదిగో అటువైపు చూడండి . అక్కడ దూరముగా పుష్పకవిమానము కనపడుచున్నది . శ్రీరామచంద్ర ప్రభువు లోకకంటకుడైన రావణుని వధించిన పిమ్మట విభీషణుడు ఆ పుష్పకవిమానమును స్వామికి అర్పించెను . దానిపై రామలక్ష్మణులు ,సీతాదేవి ,సుగ్రీవుడు ,విభీషణుడు వచ్చుచున్నారు . "అని పలికెను . హనుమ ఈ విధముగా పలుకుచుండగానే . అక్కడ ఉన్న యువకులు ,స్త్రీలు ,బాలురు ,వృద్దులు అందరూ 'అదిగో శ్రీరాముడు వస్తున్నాడు 'అనుచు సంతోషముతో చేసిన కోలాహల ధ్వనులు మిన్నుముట్టెను . అక్కడివారందూ శ్రీరాముని చూసి మిక్కిలి సంతోషముతో మునిగిపోయిరి . అప్పుడు భరతుడు విమానంపై ఉన్న శ్రీరామునికి పరమానందభరితుడై నమస్కరించెను . 
విమానము భూమిపైకి దిగెను . అప్పుడు భరతుడు శ్రీరాముని పాదములకు నమస్కరించెను . సీతాదేవికి తన ప్రవర చెప్పుకుని నమస్కరించెను . లక్ష్మణుని ఆలింగనము చేసుకొనెను . పిమ్మట సుగ్రీవ విభీషణాది వీరులందరిని ఆలింగనము చేసుకొనెను . పిమ్మట శ్రీరాముడు కౌసల్యాదేవికి ,సుమిత్రాదేవికి కైకేయికి నమస్కరించేను . వసిష్టునికి నమస్కరించెను . అప్పుడు పౌరులందరూ చేతులుజోడించి శ్రీరామా నీకు స్వాగతము అని పలికిరి . పిమ్మట భరతుడు తాను శిరస్సుపై పెట్టి తెచ్చిన శ్రీరాముని పాదుకు లను తానె స్వయముగా శ్రీరామునికి తొడిగెను . 
అప్పుడు భరతుడు శ్రీరామునితో "అన్నా !మీరు నాకు న్యాసముగా (తిరిగి ఇచ్చు ఒప్పందంపై )ఇచ్చిన రాజ్యమును మరల మీకు సమర్పించుచున్నాను . మీరు అప్పగించిన కోశాగారము ,ధాన్యాగారం, సైన్యము మీ అనుగ్రహము వలన పదిరెట్లు అయినవి . ప్రజలు సుఖశాంతులతో వున్నారు . నిన్ను చూచుటచే నా జన్మ కృతార్థమయినది . "అని పలికెను . అలా పలికిన భరతుడిని శ్రీరాముడు దగ్గరకు తీసుకుని ప్రేమతో తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ,మాట్లాడేను . పిమ్మట శ్రీరాముడు పుష్పకవిమానమును తిరిగి కుబేరుని వద్దకు వెళ్ళుటకు అనుమతి ఇచ్చెను . 

రామాయణము యుద్ధకాండ నూటముప్పదియవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment