Tuesday 5 May 2020

రామాయణము యుద్ధకాండ ----------- నూటఇరువదిఒకటవసర్గ

                                        రామాయణము 

                                  యుద్ధకాండ ------------ నూటఇరువదిఒకటవసర్గ 

బ్రహ్మ దేవుడు  సుభవచనములు  పలికిన  పిమ్మట  అగ్నిదేవుడు తండ్రి వేలే   సీతా దేవిని తీసుకొని  అగ్ని  గుండము  నుండి పైకి వచ్చెను .  సీతాదేవి ధరించిన పూలహారములు నూతనముగా చెక్కుచెదరకుండా  ఉండెను .  ఆ మహా సాద్వి యొక్క రూప వైభవములు అద్వితీయము .  అటువంటి సీతాదేవిని  అగ్ను దేవుడు  శ్రీ రాముడికి అప్పగించి  ఆయనతో  "  రామా !  నీ ధర్మపత్ని  అయాన్ ఈ వైదేహియందు  ఎట్టి దోషము లేదు  ఈ పుణ్యాత్మురాలు  నిన్ను తప్ప్ అన్యుల గురించి  ఆలోచించి ఎరుగదు  బల  గర్వితుడైన రావణుడు  నిర్జనవనములో 
నీవులేని  సమయమున  ఈమెను అపహరించెను .  రావణుడు ఈమెను  తన అంతఃపురమునందలి  అశోకవనములో  రహస్యముగా ఉంచెను .  వికృతాకారులియాన్  రాక్షస స్త్రీలను  ఈమెను  కాపలాపెట్టెను .  అప్పుడు కూడా  ఈమె నియందే మనసు ఇలిపి  నీవే దిక్కని నమ్ముకొనుచూ  దుఃకించుచుండెడిది . ఆ రాక్షసుడు ఈమెను అనేక విధములుగా  ప్రలోభపెట్టిచూచెను  . తీవ్రముగా  భయపెట్టుచుండెను  . అయినాను  ఈ సాద్వి అతనిని గురించి  ఏమాత్రము తలంపలేదు . రఘురామా  ఈమె హృదయము  పవిత్రమైనది .  ఎట్టిదోషము ఎరుగనిది  .  నామాటలకు  మారు పల్కగ  ఈమెను సవీకరింపుము . 
అగ్నిదేవుడి పలుకు విన్న పిమ్మట  శ్రీ రాముడు  అయ్యో  ఇట్టి ఉత్తమురాలిని  అన్యాయముగా  పరుష  వాక్యములతో   బాధపెట్టితిని కదా అని  కనీరు కార్చెను అపుడు  శ్రీ రా,ముడు  అగ్ని దేవునితో  " దేవా  సేఈతా దేవి యందు  ఎట్టి దోషము లేదు  ఈమె  పవిత్రురాలు  కానీ  రావణుని అంతఃపురమునందలి  అశోకవనమున  చాలా కాలము ఉన్నందువలన  ముల్లోకముల  వారికి ఈమె పాతివ్రత్యహమును   నిరూపించుటకై ఈ పరీక్ష పెట్ట వలసి వచ్చినది.  ఈమెను నేను పరిత్యజించుట  అసంభవం . " అని పలికెను. రాముడు చేసిన పనియొక్క  అంతరార్ధమును గ్రహుంచునా  మహాత్ములు  శ్రీ రాముని  ప్రశంసించిరి . అప్పుడు శ్రీ రాముడు సీతాదేవి ఓదార్చెను . 

రామాయణము -------యుద్ధకాండ --------- నూటఇరువదియొకటవసర్గ --------సమాప్తము . 













No comments:

Post a Comment