Monday 4 May 2020

రామాయణము యుద్ధకాండ -----------పదునెనిమిదవసర్గ

                                           రామాయణము 

                                           యుద్ధకాండ -----------పదునెనిమిదవసర్గ 

శ్రీ రాముడు తన పక్కనే సిగ్గు పడుతూ నిల్చున్న సీతాదేవితో  " సీతా  యుద్ధమును  రాక్షసుడి చార నుండి నీకు విముక్తిని కలిగించితిని .  చేయవలసిన పనిని చేసితిని కానీ  నిన్ను పొందుటకైకాదు  నాపై వచ్చిన కళంకము తొలగినది . ఇప్పుడు నేను స్వతంత్రుడను . దేవి  చేపలల  చితుడైనా  రావణుడు  నిన్ను అపహరించుకుపోయి మన ఇద్దరికి ఎడబాటు కలిగించాడు . ఈ అవమానము  విధివిలాసము  వాయుసుతుడు  సముద్రమును లంఘించుట  లంకను ధ్వంసము చేయుట అనే ఘన  కార్యములు పొగడదగినవి . సుగ్రీవుడు నాహితము  కోరి  సమయాను కూలంగా అనేకసలహాలు  చెప్పినాడు  అంతే కాకా సైన్యముతోసహా  యుద్దములో పరాక్రమము చూపినాడు అతని కృషి  నేడు  ఫ్లించింది  . నా భక్తుడైన విభీషణుడు  దుష్టుడైన అన్నాను విడిచి  నన్ను ఆశ్రయించాడు .  అతడు పడినాశ్రమ నిశ్ఫలము  కాలేదు . శత్రువులను జయించి వారి బారినుండి నిన్ను రక్షించితిని . ఓ సీతా సుగ్రీవాది మిత్రుల భళా పరాక్రమము వలన  యుద్ధమున నేను పడిన శ్రమ అంతా సఫలమైనది .  కానీ  ఈ కృషిత  నీ కోసము మాత్రము  కాదు . సదాచారములను  పరిరక్షించుటకు అపవాదములు తొలగించుకొనుటకు , లోక ప్రసిద్ధిచెందిన  ఇక్ష్వాకు  వంశమునకు  అపకీర్తి లేకుండా చేయుటకు నేను ఈ యుద్ధము చేసాను . నీవు పరుల ఇంట ఇంత కాలము ఉన్నందున  నీ ప్రవర్తనవిషయములో  నాకు సందేహము కలుగుచున్నది  . కనుక  జానకి ఈ భూమిమీద నీకు ఇష్టమైనచోటుకు  వెళ్ళుటకు  నేను అనుమహతించుచున్నాను   అని పలికెను. 
సీతాదేవి  ఇంతకు ముందు ఎప్పుడు   శ్రీ రాముని నోటా  ప్రియవచనములు మాత్రమే విన్నది . చాలా కాలము తర్వాత  తాను చోసిన పతిదేవుని నోటినుండి  ఇటు వాణి కట్న కఠోరమైన  వచనములువినుట చే  ఏనుగు చెకదలింప  బడిన లతా వలే చెలించిపోవుచూ  సంతత ధారగా  కనీరు కార్చెను .. 

రామాయణము --------యుద్ధకాండ --------పదునెనిమిదవసర్గ ---------సమాప్తము . 

శశి , 

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు) , తెలుగుపండితులు. 






 
















No comments:

Post a Comment