రామాయణము
ఉత్తరకాండ - నలుబదిఒకటవసర్గ
ఒక నాడు శ్రీ రామునికి ఆకాశమునుండి మదురవచనములు " శ్రీ రామచంద్రప్రభూ ! నాపేరు పుష్పకము ఇదివరలో నీ ఆజ్ఞను అనుసరించి కుభేరుడిని సేవించుటకై ఆయనవద్దకు వెళ్లితిని . ఆయన నిన్నే సేవింపమని ఆజ్ఞాపించెను . అందులకె నేను ఇచటికి వచ్చితిని " అని పలికెను .అప్పుడు శ్రీ రాముడు " విమానములలో శ్రేష్టమైన పుష్పకమా నీకు స్వాగతము . నీవు కుబేరుని అనుమతితో వచ్చితివి కావున నేను నిన్ను సవీకరించుట దోషముకాదు " అని పలికి ఆ పుష్పక విమానము పరిమళభరితమైన ధూపదీపములతో పూజించెను . పిమ్మట శ్రీ రాముడు ఆ పుష్పకవిమానముతో " పుష్పకమా నేను తలుచుకున్నవెంటనే నీవు ఇక్కడికి విచ్చేయుము . అప్పటివరకు నీవు నీకు నచ్చిన చోట ఉండవచ్చును . " అని పలికెను .
రామాయణము ఉత్తరకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ ఎం.ఏ (తెలుగు ), తెలుగుపండితులు .
No comments:
Post a Comment