Wednesday 6 May 2020

రామాయణము యుద్ధకాండ ----------------నూటఇరువదిమూడవసర్గ

                                            రామాయణము 

                                  యుద్ధకాండ ----------------నూటఇరువదిమూడవసర్గ 

దశరథమహారాజు తెరిగివెళ్లిపోయిన పిమ్మట   దేవేంద్రుడు  శ్రీరాముడితో  " రామా ! నీ దర్శనంతో  మేమెంతో సంతోషించితిమి  . మేము  ఇప్పుడు మీకు చేయగలిగిన సహాయము ఏదైనా ఉంటె చెప్పుము . "  అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు " దేవేంద్ర  మా యందు నీకు ప్రీతియున్నచో  నా మనస్సులోని మాటలను చెప్పెదను వినుము . నాకొరకై  సాహసముతో  యుద్దములో పోరాడి హాసువులువీడిన వానరవీరులందరిని పునర్జీవితులను గావింపుము ప్రానములు  సైతం లెక్క చేయక నా కోసం  ఈ వానరవీరులంతా  తమ భార్యాపిల్లలను , బంధువులను వీడివచ్చిరి . ఇంద్రా  వానరయోధులు  భల్లూఒకవీరులగాయములు మాన్పి వారిని ఆరోగ్యవంతులను గావింపుము . వారు ఎప్పటివలె  బలపరాక్రమ సంపన్నులై సంతోసగముగా  ఉండగా చూడవలెనని నాకోరిక వనరులు ఉండెడిచోట సర్వకాలములయందును  మధురములగు కందమూలఫలములు  నిర్మలమైన నాదీ జలములు వారికి అందుబాటులో ఉండునట్టు చూడుము " అని పలికెను .  
మహాత్ముడైయాన్ శ్రీరాముడీమాటలు విన్నపిమ్మట  మహేంద్రుడు "  నాయనా రామ  వానరాదులను  బఠింకపమని నీవు కోరుటవలన  వారి పట్ల నీకు గల  వాత్సల్యమేగాక నీ ఔన్నత్యము కూడా తెలియచున్నది  . నీవుకోరుకున్నట్లే  తప్పక జరుగును  .  అని పలికి  ఆవానరాదియోధులలందరిని  వారి శరీరములకు గల గాయములను మాన్పి పునర్జీవితుల్స్ను  చేసెను అప్పుడు వారందరు  గాఢ నిద్రనుండి మేల్కొనిన రీతిగా  లేచి  శ్రీ రాముయాన్కు ప్రణమిల్లిరి . 
పిమ్మట దేవతలందరు  రామలక్ష్మణులను  వీడ్కొని తామంతా విమానములపై తమతమ  స్థానములకు వెళ్లిరి . అప్పుడు శ్రీరాముడు  లక్ష్మణసమేతుడై  సకల దేవతలకు నమస్కరించి  వానరవీరులందరిని శిభిరాములలోకి వెళ్లి విస్రఅంతి తీసుకొనమని ఆదేశించెను . 
 


రామాయణము ------------యుద్ధకాండ -----------నూటఇరువదిమూడవసర్గ ------సమాప్తము 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ, (తెలుగు) తెలుగుపండితులు . 












No comments:

Post a Comment