Monday 11 May 2020

రామాయణము , ఉత్తరకాండ -----నాలుగవసర్గ

                                     రామాయణము 

                                          ఉత్తరకాండ -----నాలుగవసర్గ 

అగస్త్యుడి మాటలు వినినంతనే  శ్రీ రాముడు ' రాక్షుసులకు లంకా నగరము నివాసస్థలము  ఎలా అయ్యినది  ? ' అని ప్రశ్నించెను . అప్పుడు అగస్త్య మహాముని  రామునితో " రామా! సృష్టి కర్త  ఐన బ్రహ్మ దేవుడు మొదట జలములను సృష్టించెను . ఆ నీటిని రక్షించుటకై ప్రాణులను సృష్టించెను .  అప్పుడే ప్రాణులతో బ్రహ్మ  జలములను  రక్షించుము  అని పలికెను . అప్పుడు ఆ ప్రాణులలో  అధికముగా ఆకలి ఉన్న వారు ' మేము జలములను రక్షింతుము అని పలికిరి  ' అంతగా ఆకలిలేనివారు ' మేము జలములను పూజింతుము' అని పలికెను . అప్పుడు ఆ బ్రహ్మదేవుడు  మీలో రక్షింతుము అని పలికిన  వారు రాక్షసులగుదురు . పూజింతుము అని పలికినవారు యక్షులగుదురు . అని  పలికెను  . 
అటుల ఏర్పడిన రాక్షుసులో  కెతి , ప్రహేతి, అను సోదరులు కలరు . వారు రాక్షులకు అధిపతులు . ఆయిరువురిలో  ప్రహేతి అను వాడు ధార్మికుడు .  అతడు విరక్తితో తపోవనములకు వెళ్లెను. రెండోవాడైన హేతి  యముడిని అభ్యర్ధించి అతని సోదరి  అగు భయ అను ఆమెను వివాహము చేసుకొనెను . ఆమె మిక్కిలి భయంకరురాలు . పిమ్మట  ఆమెకు విద్యుద్కేశుడు అనే పుత్రుడు కలడు . హేతి  సంధ్యాదేవి పుత్రిక అయిన , సాలకటంకట   ను  తన కుమ్మారునికి ఇచ్చి వివాహము జరిపించెను . పిమ్మట  కొంత కాలమునకు సాలకటంకట  తన భర్తతో కలిసి  మంధర గిరికి చేరెను . ఆమెకు అక్కడ ఒక పుత్రుడుకలిగెను . ఒక రోజు ఆమె  పనిలోపడి  పుత్రుణ్ణి విస్మరించి దూరముగా వెళ్లెను . అప్పుడా బాలుడు తన పిడికిలిని నోటియందు ఉంచుకొని బిగ్గరగా ఏడవసాగెను  ఆ సమయములో పార్వతి పరమేశ్వరులు  వృషభ వాహనంపై  ఆకాశములో విహరిస్తూ  రోధించుచున్న ఈభాలుడిని  చూసిరి.  అపుడు  పార్వతి దేవికి ఆ పసికందుపై  జాలి కలిగెను . అప్పుడు శంఖరుడు   ఆ బాలుడిని  యువకుడిగా మార్చివేసెను  అంతే కాక  అతనికి అమరత్వమును . ఒక విమానమును కూడా ఇచ్చెను . అప్పుడు ఉమా దేవికూడా  రాక్షసస్త్రీలకు  సద్యోగర్భప్రాప్తించునట్లుగాను . వెంటనే శిశువు కలుగునట్లుగాను ఆ  శిసువు మరుక్షణమే యువకుడు అయ్యినట్లు వరమును ఇచ్చెను . విధ్వకేశుని కుమారుడైన  ఆ కుమారుడు  సుకేశుడుగా  ప్రసిద్దుడై  
ప్రాగ్న్యాసాలి అయ్యెను . దయాళువు ఐన  శివుడి  వరములు కూడా లభించుటచే అతడు గర్వోన్మత్తుడయ్యెను.  అలా  తోటివారిలో  ప్రముఖుడైన  ఆ సుఖేసుడు శివానుగ్రహము వలన విమానంపై  ఆకాశమంతా సంచరించు సాగేను . 

రామాయణము --------ఉత్తరకాండ ------నాలుగవసర్గ ---------సమాప్తము 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 








No comments:

Post a Comment