Monday 4 May 2020

రామాయణము యుద్ధకాండ - నూటపదునేడవసర్గ

                                 రామాయణము 

                         యుద్ధకాండ               -           నూటపదునేడవసర్గ 

హనుమ వాయు వేగముతో శ్రీ రాముని సమీపించి ఆయనతో "ప్రభూ !నీ విజయ వార్త వినగానే సీతాదేవి సంతోషముతో పొంగిపోయినది . 'నా భర్తను ,ఆయన తమ్ముడిని చూడాలనుకుంటున్నాను 'అని నాతొ పలికినది . "అని చెప్పెను . 
హనుమ పలికిన మాటలు వినగానే శ్రీ రామునికి సీతాదేవి గుర్తుకువచ్చి , అయన కంట తడి పెట్టెను . అప్పుడు  శ్రీ రాముడు . తనలో తాను  రావణుని గృహంలో  ఇంతకాలమూ ఉన్న  సీతాదేవిని  గ్రహించినచో  లోకాపవాదము  రావచ్చు ఏదోషము ఎరుగని  ఆ సాద్విని  వదిలివేయుట  మహా దోషముకాదా  అని తనలో తాను  కొంతసేపు  ఆలోచనలోపడెను  .  పిమ్మట  ఆ స్వామి  తన పక్కనే  ఉన్న విభీషణునితో  " సీతాదేవిని  చక్కగా అలంకరింప చేసి  వెంటనే ఇక్కడకు తీసుకురండి . " అని పలికెను 
శ్రీ రాముడు  ఆదేశించిన  వెంటనే  విభీషణుడు  త్వరగా  లంకా నగరంలోని అశోక వనము వద్దకు వెళ్లెను . అశోకవనము  బయట  కాపలాగా  ఉన్న రాక్షస స్త్రీలతో  తన రాకను గూర్చి  సీతా మాతకు విన్నవించమని  దర్శమునకు  అనుమతిని  ఇవ్వమని  కోరెను .  వారు వెళ్లి చెప్పగా  సీతా మాత   విభీషణునికి  దర్శమునకు  అనుమతి  ఇచ్చినది . అప్పుడు శ్రీ రాముడు జానకీ మాతవద్దకు వెళ్లి ,ఆమెను దర్శించి ,శిరస్సువంచి ఆమెకు ప్రణామము చేసి ,ఆమెతో "అమ్మా !వైదేహి !అంతఃపుర స్త్రీలు నీకు అభ్యంగన స్నానము చేయించి ,వస్త్రాభరణములు ,చక్కటి అలంకారములు చేసెదరు . పిమ్మట నీవు పల్లకీని  అధిరోహించుము  .  మీ పతి దేవుడు  మిమ్ము చూడగోరుచున్నారు .  " అని పలికెను .  
వింహీషణుడి విన్నపము విన్న పిమ్మట సీతాదేవి  "  రాక్షస రాజా  నేను ఇప్పుడే నా పతిని చూడ గోరుచున్నాను."
అని పలికెను . అప్పుడు విభీషణుడు  " అమ్మా ! నీ పతిదేవుడు ఆదేశించినదే  నేను నీకు చెప్పాను .  " అనగా  అప్పుడు సీతా దేవి  " సరే " అని పలికెను .  అప్పుడు అంతఃపుర స్త్రీ లు  సీతాదేవిని తీసుకు వెళ్లి  అభితంగానా స్నానము  చేయించిరి .  అమూల్యమైన  వస్త్రాభరణములతో  ఆమెను  అలంకరించిరి .  పిమ్మట  శ్రేష్టమైన  పల్లకీనందు  ఆమెను కూర్చుండ  బెట్టిరి . పెక్కు మంది రాక్షస భటులు  పల్లకీ చుట్టూ  రక్షణ గా  నడుచుచుండగా  విభీషణుడు కూడా  పల్లకీతోపాటే  నడుస్తూ  ఆ పల్లకిని  శ్రీ రాముడి వద్దకు  చేర్చెను .  
అది చూసిన శ్రీరాముడు  సీతాదేవిని  ఇక్కడికీ  తీసుకురండి  . అని పలికెను . అప్పుడు  విభీషణుడు  తనవెంటవచ్చుచుండగా  ఆ మైథిలి  బిడియముతో  తన శరీరమును కుదించుకొనుచూ  తనభర్తయెదుట  నిలిచెను . ఆమె  మేలిముసుగు లో  ఉన్నది  , జనుల సమక్షమున  సిగ్గుపడుచూ  తన భర్తను  ఆర్య పుత్రా  అని పిలిచింది  పిమ్మట ఆమె ఏడవసాగెను . కొద్దీ సేపటికి మోహము  పైకెత్తి  పతి ముఖమును  చూసేను . ఉదయించుచున్న  నిండు చంద్రుడి వంటి  భర్తముఖమును  చూచుటతో  ఆ దేవి భాద తొలగిపోయెను . ఇంత కాలము వరకు  ఆయన దర్శన భాగ్యమునకు  నోచుకోని  సీతాదేవికి . శ్రీ రామచంద్ర ప్రభువును  చూసే అదృష్టం పెట్టినందుకు  ఆమె వదనము  నిర్మలమైన  చంద్రకాంతులతో  శోభిల్లెను . 

రామాయణము ---------యుద్ధకాండ ----------నూటపదునేడవ సర్గ ------------సమాప్తము . 


శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) తెలుగుపండితులు . 











No comments:

Post a Comment