Wednesday 6 May 2020

రామాయణము , యుద్ధకాండ ---------నూటఇరువదిఆరవసర్గ

                                       రామాయణము 

                                యుద్ధకాండ ---------నూటఇరువదిఆరవసర్గ 


శ్రీ రాముడి అనుమతితో  ఆ పుష్పకవిమానము ఆకాశములోకి  లోకి లేచి ఎగురసాగెను . అప్పుడు శ్రీ రాముడు  భూమివాయిపు కిందకు చూస్తూ  సీతాదేవితో  " జానకి  ఇదుగో త్రికూటపర్వతముపై కల  ఈ లంకా నగరమును చూడుము .  దీనిని  విశ్వకర్మ నిర్మించాడు . దానిపక్కనే ఉన్న మాంసకాండములతో  , రక్తముతో తడిసిఉన్న ఈ  యుద్దభూమినిచూడు  . ఇక్కడే అనేకమంది వానర వీరులు రాక్షస యోధులు  చంపబడ్డారు  . ఇక్కడే  బ్రహ్మచేత వారములు పొంది వర  గర్వితుడైన  రావణుడు కూడా  మరణించి  భాదిదై పది ఉన్నాడు చూడుము . రావణుని సోదరుడు కుంభకర్ణుణ్ణి  కూడా ఇక్కడే నేను చంపాను . లక్ష్మణుడు రావణుడికుమారుడగు ఇంద్రజిత్తునుకూడా  ఇక్కడే వధించాడు  . సుందరీ   !  మానముఁదాటుతున్నసముద్రమును చూడుము .  దానిపై కనిపించుచున్న  సేతువుని  నీకొరకు మేమేనిర్మించితిమి .  అదిగో  అక్కడ కనపడుచున్న పంపాతీరమును చూడుము . ఇదిచాలా  రామణీయప్రదేశము . దాని  పక్కనే ఉన్న  ఋష్యమూక పర్వతసమును చూడుము . ఇక్కడే నేను సుగ్రీవుడు మిత్రులమైనాము  . సీతా అదిగో  చిత్రవిచిత్రములైన వనములతో కనిపించే  ఆ నగరమే కిష్కింద . మం వానర రాజు సుగ్రీవుని రాజ్యము ఇది . అని " శ్రీ రాముడు  పలుకగా  అప్పుడు సీతాదేవి  రామునితో  స్వామి  సుగ్రీవుడి పోషణలో ఉన్నటువంటి  తార , రుమా  అంతఃపుర స్త్రీలందరితో కలసి  మనరాజ్యమునకు వెళ్లవలెనని  నా కోరిక . " అని పలికెను . 
అప్పుడు  శ్రీ రాముడు అట్లే  కానిమ్ము  అనిపలికి  విమానమును కిందకు దింపి  సుగ్రీవునితో  " వానరోత్తమా ! మేకపివీరులందరు  మీమీ భార్యలను తీసుకొనిరండు . వారిని కూడా అయోధ్యకు తీసుకు వెళ్ళెదము . " అనిపలికెను . శ్రీ రాముడు  ఇలా పలికిన వెంటనే  సుగ్రీవుడు ఇంకాకొంతమంది వానరవీరులు గబగబ  కిష్కిందానగరములోనికి ప్రవేశించిరి .  పిమ్మట సుగ్రీవుడు అంతఃపురములోకి వెళ్లి  తారతో  " తారా ! మిగిలిన వానరపత్నులతోపాటుగా నీవు  అయోధ్యానగరమును దర్శించుటకు శ్రీ రాముడు అనుమతిని  ఇచ్చెను కావున  మీరందరు వెనువెంటనే తయారులై  నాతోరాదు అని పలికెను . 
అప్పుడు  తార సుగ్రీవుడి మాటలు విన్నంతనే  అక్కడి వానర స్త్రీలందరిని పిలిచి "  మనమందరము  సమస్తవనరులతో కలిసి  అయోధ్యకు వెళ్ళుటకు  సుగ్రీవ మహారాజు అజ్ఞ్యాపించినాడు . కావున మీరందరు వెనువెంటనే ప్రయాణమునకు సిద్దముకండి .  నేను కూడా అయోధ్యానగరమును చూడాలనుకొంటున్నాను . పురజనులతో కలిసి  శ్రీ రామ  ప్రభువు అయోధ్యా నగరములో అడుగు పెట్టేదృశ్యమును  అక్కడి  అంతఃపుర స్త్రీ లను  మనము  దర్శించుకొని వద్దాము . " అని పలికెను .  తార  ఆలా పలికిన వెంటనే  అక్కడి స్త్రీలందరు  మిక్కిలి  వేగంగా  తయారై విమానమువద్దకు వెళ్లిరి  .  పిదపేవారు  ఆ విమానమునకు ప్రదక్షిణచేసి  సీతాదేవిని చూడవలననే తొండరలో  గబగబా  ఆ విమానమును ఎక్కిరి  పిదప  రాముడి ఆజ్ఞతో  ఆ విమానము మళ్ళీ   ఆకాశమువైపు  ఎగిరి అయోద్యవైపుగా దూసుకు పోసాగెను . అప్పుడు  దారిలో వచ్చు  ప్రదేశములను చూస్తూ  శ్రీరాముడు సీతా దేవితో  సీతా  అదిగో  పంచవటిలో  మనము నివసించిన  ఆ  కుటీరమును  నీయవు గుర్తుపట్టితివా  సీతా అదిగో అగస్త్యమహాముని  ఆశ్రమము వచ్చుచున్నది  చూడు ,  ఇదిగో  ఈ పక్క శరభంగ మహాముని  ఆశ్రముని చూడు ,  అత్రిమహర్షిని మనము దర్శనము చేసుకొన్నది  అదిగోఅక్కడే  .  అదిగో చిత్రకూట పర్వతము మనము ఇక్కడ వున్నప్పుడే  భరతుడు  మానవద్దకు వచ్చి  మనల్ని తిరిగి రాజ్యమునకు రమ్మని  ప్రార్ధించినందు  కదా  అదిగో  దూరముగాకనబడుచున్నది  భారద్వాజాశ్రమము . దాని తదుపరి  కానవచ్చునది శృంగిభేరి పురము  . దాను  ఆవలి  కనపడుచున్నది చూసావా అదే మన రాజ్యము అయోధ్యా  అని పలికెను . శ్రీ రాముడు ఈవిధముగా చెప్పుచున్నప్పుడు  . వానర , వీరులందరు  విమానము నుండి ఆసక్తిగా కిందకు చూచుచుండిరి . 


రామాయణము ------------యుద్ధకాండ-----------నూటఇరువదిఆరవ సర్గ -----------సమాప్తము 

శశి , 

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 















































No comments:

Post a Comment